బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల
నిర్మిస్తున్న ‘శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల
చిత్ర విశేషాలను వివరిస్తూ-‘ మా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ద్వీతీయ చిత్రంగా బాలకృష్ణతో ఈ శ్రీమన్నారాయణ చిత్రాన్ని
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది. పాటలు అన్ని వర్గాల శ్రోతలను
విశేషంగా అలరించాయి. ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని ఆగస్టు 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈచిత్రం మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్‌కు మంచి పేరును తెస్తుందన్న నమ్మకం నాకుంది'' అన్నారు
No comments: