Trending

హవ్వ! ఆరేళ్లలో 60స్థానాలకు ఉప ఎన్నికలా?


ఒకానొకప్పుడు ప్రపంచదేశాల్లో ఆంధ్రులు అంటే ఆత్మీయాభిమానాలకు ప్రతీకగా గుర్తించేవారు. ఇప్పుడు ప్రపంచదేశాల్లో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. ఆరేళ్లలో 60స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. అంటే ఇక్కడ ఒక పార్టీ నుంచి ఇంకోపార్టీకి మారినప్పుడల్లా పదవులకు రాజీనామా చేస్తారా? అస్సలు బాధ్యతే లేకుండా పదవులను త్యజించటమేమిటీ? నిరసన తెలియజేయటానికీ రాజీనామ
ాలు చేస్తే గెలిపించిన ప్రజలు తిరిగి ఎలా నమ్ముతున్నారు? ప్రభుత్వధనం ఊరికినే ఎన్నికల పేరుతో ఖర్చు చేస్తే సిటిజన్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అభివృద్థి జరగాలంటే నిధుల అవసరాన్ని ఎలా గుర్తిస్తున్నారు? ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే రాజ్యాంగం ఏమి చేస్తోంది? వంటి పలురక రకాల ప్రశ్నలు ఈ ఎన్నికల గురించి వివరిస్తే తలెత్తుతున్నాయి. ఎందుకంటే విదేశాల్లో మన నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, నిబద్ధత ఇంకా పాటిస్తూనే ఉన్నారు. తాజాగా బ్రిటన్‌ ప్రతినిధులు ఈ రాజీనామాల ప్రహసనం తెలిసి హవ్వ! అనుకున్నారు. బ్రిటన్‌దేశంలో ప్రవేశపెట్టిన చట్టాన్ని తిరస్కరించినందుకు ఒకే ఒక్కరు రాజీనామా చేశారని వారి చరిత్ర చెబుతోంది. ఇదే విషయాన్ని స్పీకర్‌కు వారు తెలియజేశారు కూడా.


No comments:

Item Reviewed: హవ్వ! ఆరేళ్లలో 60స్థానాలకు ఉప ఎన్నికలా? Rating: 5 Reviewed By: Tollywood Timepass