YSR తమ్ముడు YS .వివేకా పార్టీ మారే సంకేతాలు ఇస్తున్నారు .తనకు కాంగ్రెసులో ఉండాలనిపించడం లేదన్నారు. పార్టీ కోసం కుటుంబాన్ని వదిలేసినప్పటికీ తనకు కాంగ్రెసులో ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ను అందరూ దోషిగా చేసి మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించమని కార్యకర్తలను కోరానని అన్నారు. ఇటీవల కాంగ్రెసు పార్టీలోని పలువురు నేతలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం వివేకా జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. వైయస్‌ను తిడితే తాను సహించేది లేదని ఆయన గతంలోనే పార్టీని హెచ్చరించారు. అయినప్పటికీ నేతలు వైయస్ పైన విమర్శలు చేస్తున్నారని, అందుకే ఆయన కాంగ్రెసును వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: